సావిత్రి జీవితాన్ని తప్పుగా చూపించారు.. వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు

Recommended Video

Actress Vanisri Sensational Comments On Mahanati Movie || Filmibeat Telugu

లెజెండరీ నటీమణి సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించింది. వైజయంతి మూవీ బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. బయోపిక్ ల ద్వారా కూడా భారీ విజయాలు సాధించవచ్చని నిరూపించింది మహానటి సినిమా. అయితే ఈ సినిమాపై తాజాగా సీనియర్ నటి వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే..

సినీ ప్రముఖులకు భిన్నంగా

సినీ ప్రముఖులకు భిన్నంగా

దాదాపు ఏడాది క్రితం విడుదలైన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎందరో సినీ ప్రముఖులు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. కానీ సీనియర్ నటి వాణిశ్రీ మాత్రం అందుకు బిన్నంగా స్పందించడం సంచలనం సృష్టిస్తోంది. తనకు మహానటి సినిమా నచ్చలేదని వాణిశ్రీ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.

సావిత్రి జీవితాన్ని తప్పుగా చూపించారు

సావిత్రి జీవితాన్ని తప్పుగా చూపించారు

'మహానటి' సినిమా చూస్తుంటే బోర్ కొట్టిందని, సెకండ్ హాఫ్ లో మధ్యలోనే లేచి వెళ్ళిపోయానని సీనియర్ నటి వాణిశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సావిత్రి జీవితంలో అలాంటి సంఘటనలేవి జరగలేదని పేర్కొంటూ.. మహానటి సినిమా వాస్తవ సంఘటనలకు దూరంగా ఉందని వాణిశ్రీ విమర్శలు గుప్పించడం పలు చర్చలకు దారితీసింది.

నా జీవితంలో అలాంటి వాటికి చోటు లేదు

నా జీవితంలో అలాంటి వాటికి చోటు లేదు

కాగా వాణిశ్రీ మాట్లాడుతుండగా.. 'మీ బయోపిక్ కూడా వెండి తెరపైకి రావాలని కోరుకుంటున్నారా అని' ఓ విలేకరి ప్రశ్నించగా దానిపై కూడా ఆసక్తికరంగా స్పందించింది వాణిశ్రీ. ఏ సెలెబ్రిటీల జీవితాల్లో అయితే అనూహ్యమైన మలుపులు, వివాదాలు ఉంటాయో.. అలాటి వారి బయోపిక్స్ మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారని, తన జీవితంలో అలాంటి అలాంటి వాటికి చోటు లేదని వాణిశ్రీ తెలిపింది.

 సీనియర్, ఫేమస్ నటి కావడంతో

సీనియర్, ఫేమస్ నటి కావడంతో

తెలుగు సినీ పరిశ్రమలో వాణిశ్రీ సీనియర్, ఫేమస్ నటీమణి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలతో అప్పట్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది వాణిశ్రీ. కాబట్టి సావిత్రి జీవిత కథ 'మహానటి' పై ఆమె చేసిన కామెంట్స్ పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X