సినిమాలు ఫ్లాప్.. లైఫ్‌లో ఫెయిల్యూర్.. మూడు పెళ్లిళ్లు హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమా సెలబ్రిటీలు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తారు. సినిమాలపరంగానో.. వ్యక్తిగత జీవితం పరంగానో న్యూస్ లో నానుతూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారింది. తన తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మాత్రం వారి దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి కూడా సిద్ధం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్- దిగ్గజ నటి మంజుల నటవారసురాలు వనిత విజయ్ కుమార్ (VANITHA VIJAY KUMAR). ఈ అమ్మడు తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలలోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఫ్యామిలీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ కావడంతో వనిత విజయ్ కుమార్ చాలా సులభంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'చంద్రలేఖ' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవీ' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ అందిపుచ్చుకుంది.

కెరీర్ లో నిలదొక్కుకున్న ఆ టైంలో అనూహ్యంగా పెళ్లి చేసుకొని అందరిని షాక్ ఇచ్చింది. పెళ్లి కారణంగా సినిమాలకు దూరమైపోయింది. అయితే.. ఆమె సినిమా లైఫ్ అంతంత మాత్రమే సాగినా.. వైవాహిక జీవితం మాత్రం ఒడిదొడుకలు ఎదుర్కొంటూ వివాదాస్పదంగా మారింది. తొలుత నటుడు ఆకాశ్.. ఆమె పెళ్లి చేసుకోగా వీరికి విజయ్ శ్రీహరి, జ్యోతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, వీరి వ్యక్తిగత జీవితంలో మనస్పర్ధలు రావడం వల్ల ఆకాష్ కు విడాకులు ఇచ్చేసింది వనిత.
ఆ తర్వాత వ్యాపారవేత్త అయిన ఆనంద్ జై రాజన్ రెండో పెళ్లి చేసుకుని. వీరికి జయ అనిత అనే కుమార్తె జన్మించింది. కానీ, వీరి వివాహ బంధం కూడా సాఫీగా సాగలేదు. కొన్ని రోజులకే వీరు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం సాగించారు. ఆ తర్వాత 2020లో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. వీరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో ఈ వివాహ బంధం కూడా మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది. వీరిద్దరూ విడిపోయారు. మద్యానికి బానిసమైన పీటర్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

మూడు పెళ్లిళ్లతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వనిత తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఓ బీచ్‌లో మోకాళ్ల మీద కూర్చొని రాజ్‌కు ప్రపోజ్ చేస్తూ విజయ్ కుమార్ కనిపించారు. అతడు కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్‌తో ఆమె గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక రాబర్ట్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రాబర్ట్ పాపులర్ అయ్యాడు. అతడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ, డ్యాన్సర్‌గానూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే .. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? లేదా అనేది క్లారిటీ లేదు. నాలుగో పెళ్లి ప్రకటన చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











