క్రికెటర్‌తో పెళ్లి వార్తపై వరలక్ష్మీ శరత్ కుమార్ క్లారిటీ.. ఒంటికాలిపై లేచి..

ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన కోలీవుడ్ చిన్నది వరలక్ష్మీ శరత్ కుమార్... ఏదో విధంగా వార్తలకెక్కుతూనే ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ... తనదైన పంథాలో దూసుకుపోతున్న వరలక్ష్మీ... ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అదునుగా.. మరోసారి అమ్మడి పెళ్లిపై రూమర్లు గుప్పుమన్నాయి.

పెళ్లివార్తపై వరలక్ష్మి

పెళ్లివార్తపై వరలక్ష్మి

కొన్ని రోజులుగా వరలక్ష్మి కాస్త సైలెంట్ అవ్వడం, పైగా సినిమాలు కూడా పెద్దగా సైన్ చేయకపోవడంతో ఇక అమ్మడు పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అవ్వబోతోందని ఈ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు... అబ్బాయి.. క్రికెటర్ అన్న మాట కూడా వినిపించడంతో ఇక... ఈ ముచ్చట కాస్తా వైరల్ గా మారింది. అంతేకాదు... ఇక అమ్మాయి సినిమాలకు టాటా చెప్పేస్తుందన్న మాట కూడా వినిపించింది.

ఊరంతటికి తెలిసిన తర్వాతే.. నాకు

ఊరంతటికి తెలిసిన తర్వాతే.. నాకు

ఇక అసలే ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన వరలక్ష్మీ... ఇక ఈ వార్తపై ఒంటికాలిపై లేచింది. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వారిపై చిందులు తొక్కుతూ... ఓ ఘాటైన ట్వీట్ చేసింది. తన పెళ్లి గురించి ఊరంతా తెలిసిన తరువాతే తనకు తెలుస్తోందన్న... వరలక్ష్మీ... ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోవడంలేదని క్లారిటీ ఇచ్చేసింది.

పెళ్లి కుదిరితే ఇంటిపైకెక్కి గట్టిగా

పెళ్లి కుదిరితే ఇంటిపైకెక్కి గట్టిగా

ఇప్పట్లో ఆ ఆలోచన కూడా లేదని చెబుతూనే, సినిమాలు మానేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు... ఇంటి పైకప్పుకెక్కి గట్టిగా అరిచి మరీ చెబుతాను అంటూ సెటైర్ వేసింది. ఇలా రూమర్లను క్రియేట్ చేసి కాలం గడుపొద్దని వార్నింగ్ ఇచ్చింది. నాకు పెళ్లి కుదిరితే అంతకంటే సంతోషం ఏమి ఉంటుంది చెప్పండి అంటూ ప్రశ్నించింది

 గతంలో విశాల్‌‌తో పెళ్లి రూమర్లు

గతంలో విశాల్‌‌తో పెళ్లి రూమర్లు

ఇకపోతే వరలక్ష్మీ పెళ్లి గురించి రకరకాల కథనాలు రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనే అమ్మడుకి, హీరో విశాల్ కు పెళ్లి ఖాయం అయిందన్న వార్తలు వినిపించాయి. కానీ, అవన్నీ.. వట్టిమాటలేనని తేలిపోయాయి. విశాల్, అనీశా అనే అమ్మాయితో మూడు ముళ్ల బంధంలోకి ఎంటరయ్యేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు అమ్మాయి నటించిన సినిమా కట్టేరి లాక్ డౌన్ తరువాత విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X