ఫస్ట్‌లుక్: ‘నాగకన్య’గా వరలక్ష్మి శరత్ కుమార్
పందెం కోడి 2, సర్కార్ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న తమిళనటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో 'నాగ కన్య'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన తమిళ చిత్రం 'నీయా' తెలుగులో 'నాగకన్య'గా విడుదల కాబోతోంది.
ఈ మధ్యకాలంలో నాగిని నేపథ్యంలో ఫాంటసీ చిత్రాలు రాలేదు. చాలా రోజుల తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో ఈ తరహా చిత్రం వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎల్. సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని ఎ. శ్రీధర్ సమర్పణలో జంబో సినిమాస్ వారు నిర్మిస్తున్నారు.

ఈ ఫాంటసీ సస్పెన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. వరలక్ష్మి తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక భిన్నమైన కాన్సెప్టుతో ఈ మూవీ రూపొందుతోంది.
ఇందులో రాయ్ లక్ష్మి, కేథరిన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తమిళ హీరో 'జై' ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. త్వరలో తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











