Don't Miss!
- News కలలో శ్రీరామ దర్శనం.. మీ జీవితంలో ఊహించని అద్భుత ఫలితం
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
Hanu-Man: తేజ సజ్జాకు తల్లిగా యంగ్ హీరోయిన్.. అంజమ్మ పవర్ఫుల్ లుక్ వచ్చేసింది
గతంతో పోలిస్తే ఇప్పుడు మన తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో రూపొందుతున్నాయి. వాటన్నింటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ ఇంకా ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అదే సమయంలో చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నాయి. ఇప్పుడలా టాలీవుడ్ నుంచి ప్రయోగాత్మకంగా వస్తోన్న పాన్ ఇండియా చిత్రమే 'హనుమాన్'. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిందనే చెప్పుకోవాలి.
టాప్ తీసేసి రచ్చ చేసిన ఈషా రెబ్బా: క్లోజప్‌లో అందాలను చూపిస్తూ యమ హాట్‌గా!
విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన టేకింగ్‌తో కెరీర్ ఆరంభం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. దర్శకుడిగా ఎంతో మంచి పేరును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించిన అతడు.. పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను చేస్తున్నాడు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ అంచనాలను పెంచాయి.
పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న 'హనుమాన్' మూవీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లలను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అంజమ్మ పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేశారు.
Aadavallu Meeku Johaarlu ట్విట్టర్ రివ్యూ: శర్వానంద్ మూవీకి షాకింగ్ టాక్.. అలా అయితేనే నచ్చుతుందట!
'హనుమాన్' మూవీలో తేజ సజ్జా టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇక, తాజాగా ఈ మూవీలోని అంజమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను వదిలారు. దీన్ని మక్కల్ సెల్వీ వరలక్ష్మి శరత్‌కుమార్ చేస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆమె చేతిలో కొబ్బరి బోండాల గెలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. మొత్తంగా ఇందులో ఆమె ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇక, ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ 'అంజనాద్రి నుంచి ఎంతో ధైర్యవంతురాలైన అంజమ్మ వచ్చేసింది' అంటూ పరిచయం చేశారు. హనుమంతుడి తల్లి అంజనాదేవి కావడంతో ఇందులో వరలక్ష్మి.. హీరో తల్లి పాత్రను చేస్తుందని క్లారిటీ వచ్చేసింది.
'హనుమాన్' మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉంటూనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దీన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నాయి