క్రాక్.. వరలక్ష్మి శరత్ కుమార్ సర్‌ప్రైజ్.. రియల్లీ ఇంట్రెస్టింగ్

నేడు (మార్చి 5) నటి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రవితేజ హీరోగా రాబోతున్న 'క్రాక్' సినిమా నుంచి ఆమె లుక్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేసింది చితయూనిట్. ఈ మేరకు సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర పేరు జయమ్మ అని తెలుపుతూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు యూనిట్ సభ్యులు.

ఈ పోస్టర్‌లో వరలక్ష్మి గెటప్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఆమె లుక్ చూస్తుంటే 'క్రాక్'లో పోషించే రోల్ చాలా బలమైనదని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసిన రవితేజ ఫ్యాన్స్ సూపర్ అని పేర్కొంటూ ఆమెకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Varalaxmi Sarathkumar look from Ravi Tejas Krack

మాస్ మాహారాజా రవితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో 'క్రాక్' మూవీ తెరకెక్కుతోంది. క్యాచీ టైటిల్‌తో విలక్షణ కథాంశం ఎంచుకున్న గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్‌ని హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X