NBK107: బాలకృష్ణ సినిమాలో స్టార్ డాటర్.. మళ్లీ అలాంటి పాత్రే అని ప్రకటన

కొంత కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన నటసింహా నందమూరి బాలకృష్ణ.. గత ఏడాది చివర్లో వచ్చిన 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, భారీ వసూళ్లతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు, ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నెల రోజులు దాటినా కూడా అదే రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే గోపీచంద్ మలినేనితో చేసే సినిమాను ప్రారంభించబోతున్నారు.

వాస్తవానికి 'అఖండ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్రకటించాడు. గత ఏడాది రవితేజ నటించిన'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం నిజ జీవిత సంఘటనలతో కూడిన మరో పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. అంతేకాదు ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని అన్ని పనులనూ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు.

Varalaxmi Sarathkumar Onboard for Balakrishna and Gopichand Malineni Movie

పవర్‌ఫుల్ మాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోయే విలన్ పాత్రపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కన్నడ సీనియర్ అండ్ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇందులో అతడు ఓ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. దీంతో ఇదే విలన్ రోల్ అని అంతా అనుకుంటున్నారు.

ఇక, తాజాగా నందమూరి బాలకృష్ణ 107వ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక, దర్శకుడు గోపీచంద్ మలినేని 'పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ మా జయమ్మకు స్వాగతం. నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో ఆమె కీలక పాత్రను చేస్తుంది. ఆమె కెరీర్‌లో ఈ పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండబోతుంది' అని ట్వీట్ చేశాడు. దీంతో వరలక్ష్మీ రోల్‌పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో.. అతడికి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X