హ్యాక్ అయిన వరలక్ష్మీ అకౌంట్... డైలమాలో ముద్దుగుమ్మ

కోలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన వరలక్ష్మీ శరత్ కుమార్ కు అనుకోని ఇబ్బంది ఎదురైంది. అమ్మడి సోషల్ మీడయా అకౌంట్లన్నీ ఒక్కసారిగా హ్యాకింగ్ బారిన పడటంతో అమ్మాయి డైలమాలో పడింది.
తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకైనట్లు గుర్తించిన వరలక్ష్మీ ఈ మేరకు ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రస్తుతం సంబంధిత నిపుణులు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నట్లు తెలిపింది.

డిసెంబర్ 2 రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసినట్లు వరలక్ష్మి పేర్కొంది. రాబోయే రోజుల్లో తన అకౌంట్ నుంచి ఎలాంటి సందేశాలు వచ్చినా పట్టించుకోవద్దని వెల్లడించింది.

Varalaxmi Sarathkumars Twitter and Instagram accounts hacked

ప్రస్తుతానికి వరలక్ష్మి రెండు అకౌంట్లూ డీయాక్టివేట్ అవ్వగా యాప్ సంబంధిత నిపుణులతో అమ్మడి వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ట్విట్టర్ ఇన్స్టా అకౌంట్లు పునఃప్రారంభమవ్వనున్నాయి.

ఇటీవలే జీ5లో విడుదలైన డానీలో అద్భుతమైన నటనతో కుంతవాయ్ గా అదరగొట్టేసిన వరలక్ష్మీ మరో అరడజనుకు పైగా సినిమాలకు సంతకాలు చేసేసింది. వివిధ భాషల్లో అమ్మడు నటించబోతున్న సినిమాలు ఇంకా ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

కన్ని రాశి, కాత్తెరి, పంబన్, ఛేజింగ్, పిరాంథల్, పరాశక్తి, కలర్స్, యానై వంటి సినిమాల్లో వరలక్ష్మీ నటించబోతోంది. తెలుగులోనూ క్రాక్ సినిమాతో అమ్మడి కనువిందు చేయబోతోంది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా రవితేజ, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X