Varanasi నా డ్రీమ్.... జీవితంలో ఒక్కసారే ఇలాంటి ప్రాజెక్ట్ : మహేశ్ బాబు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మూవీ వారణాసి. ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా పేరును చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాట్టర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ సినిమా విశేషాలు.. ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్.. మహేశ్ బాబు లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
టైటిల్ వీడియో లీక్‌పై రాజమౌళి అసహనం
ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను స్క్రీన్ మీద విడుదల చేయాలని రాజమౌళి భావించారు. ఈ ఈవెంట్ కోసం కట్టుదిట్టంగా రిహార్సల్స్ చేశామని.. స్క్రీన్ చుట్టూ భారీ క్రెయిన్స్‌తో పరదాలు కట్టించామని జక్కన్న తెలిపారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారో కానీ కొందరు డ్రోన్‌తో తాము రిహార్సల్స్ చేస్తున్నదంతా షూట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఏడాది కష్టం, కొన్ని వందల మంది నిద్రాహారాలు లేకుండా పడ్డ కష్టాన్ని డ్రోన్ ద్వారా ఎత్తుకుపోయారని రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు.

కృష్ణగారి గొప్పదనం తెలిసింది
తాను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిని అని.. కానీ ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణగారి గొప్పదనం తెలిసిందని రాజమౌళి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను ఆయన పరిచయం చేశారని ప్రశంసించారు. ఈస్ట్‌మన్ కలర్, సినిమా స్కోప్, 70 ఎంఎం సినిమాలను టాలీవుడ్‌కు పరిచయం చేశారని రాజమౌళి చెప్పారు. ఈ సినిమాకు కూడా తాము కొత్తగా ఐమ్యాక్స్ థియేటర్ల కోసం ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నట్లు జక్కన్న తెలిపారు. మహేశ్ బాబు గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని.. షూటింగ్‌కు, ఆఫీస్‌కి వస్తే ఆయన ఫోన్ చూడరని ప్రశంసించారు.
అప్‌డేట్ అదిరిందా?
ఆ తర్వాత మహేశ్ బాబును ఎద్దు లాంటి వాహనంపై నుంచి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు రాజమౌళి. ఇందులో మహేశ్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. ఈ సందర్బంగా మహేశ్ మాట్లాడుతూ... స్టేజ్ మీదకి సింపుల్‌గా నడిచొస్తాను అన్నాను, కానీ ఆయన వినలేదు. ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో చూశారుగా. నా స్టైల్‌లో బులుగు రంగు చొక్కా వేసుకుని వస్తానని అన్నాను వినలేదు. ఒక షర్ట్ వేసుకోమన్నారు.. దానికి గుండీలు లేవు.. రెండు మూడు బటన్స్ ఇవ్వమన్నాను. బతికిపోయాను చొక్కా లేకుండా రమ్మనలేదు.. నెక్ట్స్ అదే అనుకుంటా.. మీరంతా ఓపికగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఇన్నాళ్లు అప్‌డేట్ అప్‌డేట్ అన్నారు కదా.. అప్‌డేట్ ఎలా ఉంది. నా డైలాగ్‌లో చెప్పాలంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది కదా అని మహేశ్ అన్నారు.
నాన్న గారి కోరిక తీర్చా
నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ నన్ను పౌరాణికం క్యారెక్టర్ చేయ్.. ఆ గెటప్స్‌లో చాలా బాగుంటావు అనేవారు. నాన్నగారు ఎందుకు అలా అనేవారో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.. నా మాటలు ఎక్కడున్నా వింటూనే ఉంటారు. వారణాసి సినిమా ... వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను.. వారణాసి రిలీజ్ అయ్యాక భారతదేశం మొత్తం గర్వపడుతుంది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహాకే వదిలేస్తున్నాను. మీరు నాపై చూపించే అభిమానం మాటల్లో చెప్పలేను, చేతులెత్తి దండం పెట్టడం తప్పించి నాకేం తెలియదు. మేము, మా టీం, పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడి ఈ ఈవెంట్ ప్లాన్ చేశాం. దయచేసి మీరు ఇంటికి సఫ్‌గా వెళ్లండి అని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











