మహేశ్ - రాజమౌళి మూవీ రిలీజ్ ఎప్పుడంటే? లీక్ చేసిన ఎంఎం కీరవాణి!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి వారణాసి అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కు ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు - రాజమౌళి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో లీక్ చేసేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేలా పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కుంభగా పృథ్వీరాజ్... మందాకినిగా ప్రియాంక చోప్రాలు నటిస్తున్నారు.
చిన్నప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ గారంటే చాలా ఇష్టం. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాళ్లు ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు. మహేశ్ బాబు అంటే ఇప్పుడు అంతే ఇష్టం. పవర్‌ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ కోసం పోకిరిని ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు. నేను బీట్ సరిగా కొట్టననే ఓ టాక్ ఉంది. కానీ ఈసారి నేను ఒక ఫ్లాట్ కొన్నాను.. ఫ్లాట్ అంటే హైదరాబాద్‌లోనో, విశాఖలోనో కాదు. టైల్స్ వేసేశారు.. బిల్డర్ హ్యాండోవర్ చేసేశారు.. 2027 సమ్మర్‌లో గృహ ప్రవేశం అని ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు ఎంఎం కీరవాణి. దాంతో మహేశ్ బాబు అభిమానులు సంబరాలకు అంతే లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications











