Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌ అఫీషియల్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Varanasi Movie Release Date Fixed: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ వారణాసి (Varanasi). ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ద్వారా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న చర్చ నడుస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, రిలీజ్ డేట్ గురించి ఇంత ముందే మాట్లాడటంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ జక్కన్న ప్లానింగ్ మాత్రం ఎప్పటిలాగే డిఫరెంట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో వారణాసి మూవీ మేకర్స్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

'వారణాసి'లో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడన్న విషయాన్ని రాజమౌళి ఇప్పటికే స్వయంగా వెల్లడించారు.

Varanasi Movie Release Date Fixed

మహేష్ బాబు సినిమా మొదలైనప్పటి నుంచే రాజమౌళి తన వర్కింగ్ స్టైల్‌లోనూ మార్పులు తీసుకొచ్చారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రమోషన్స్ విషయంలో నెమ్మదిగా ఉండే జక్కన్న, ఈ సినిమాకు మాత్రం ఏడాదిన్నర ముందే టీజర్, మేకింగ్ వీడియోలు విడుదల చేయడం విశేషంగా మారింది. రిలీజ్ డేట్ విషయంలోనూ అంతే ముందస్తు ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు.

తాజాగా వారణాసి మూవీ టీమ్ సోషల్ మీడియాలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' 2027లోనే రిలీజ్ అవుతుంది అని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటికే నడుస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడినట్టయింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి రావు అనే అనుభవం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే 2027 రిలీజ్ అంటే చాలా మంది నెటిజన్లు ఇంకా నమ్మడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9, శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కాసేపు కనిపించబోతుండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైగా ఆ సమయంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, ఏడాది ముందే రిలీజ్ డేట్ లాక్ చేస్తే ఎవరూ ఎదురుగా రావద్దన్నదే జక్కన్న మాస్టర్ ప్లాన్ అని సమాచారం.

ఇక షూటింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే, 2026 ఫస్ట్ హాఫ్‌లోనే షూటింగ్ పూర్తి చేయాలని, దానికి తర్వాత ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, నాలుగు నెలలు ప్రమోషన్లకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు, పారిస్‌లోని ప్రతిష్టాత్మక లే గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో 'వారణాసి' టీజర్ రిలీజ్ చేయాలన్న ప్లాన్ కూడా ఉందని టాక్. ఇది నిజమైతే, ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన ఘనతగా 'వారణాసి' నిలవనుంది. ఇలా రిలీజ్ డేట్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అన్నీ అడ్వాన్స్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న రాజమౌళి, ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తారా? 2027 ఏప్రిల్ లో 'వారణాసి' థియేటర్లలోకి వస్తుందా? అన్నది వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X