Varanasi : ఆ రూల్‌‌‌ బ్రేక్ చేసిన రాజమౌళి.. వారణాసి రన్‌టైమ్‌పై జక్కన్న క్లారిటీ..

Varanasi Movie: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి- పర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రన్ టైం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా నిడివి గురించి జక్కన్న కీలక క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రన్‌టైమ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటీ?

ముఖ్యంగా ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమాల్ని గమనిస్తే.. దాదాపు అన్నీ మూడు గంటల పైబడే రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఉదాహరణకు బాహుబలి 2 ( Baahubali 2: The Conclusion )రీ-రిలీజ్ వెర్షన్ సుమారు 3 గంటల 40 నిమిషాల వరకు సాగగా, RRR నిడివి దాదాపు 3 గంటల 6 నిమిషాలు. అలాగే పుష్ప 1 దాదాపు 2 గంటల 59 నిమిషాలు ఉండగా, పుష్ప 2 (Pushpa 2: The Rule) అయితే 3 గంటల 15 రన్ టైం ఉంటుంది.

Varanasi Movie Runtime SS Rajamouli Confirms Under 3 Hours for Mahesh Babu s Pan-India Film

ఈ నేపథ్యంలో, తాజాగా దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా వారణాసి (Varanasi)కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుందని చాలామంది భావించారు. అంతేకాదు, రిలీజ్ డేట్ పోస్టర్‌పై కనిపించిన గ్లోబ్ ట్రాట్టర్ ట్యాగ్ కారణంగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందన్న రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 'వారణాసి - గ్లోబ్ ట్రాటర్ పార్ట్ 1','వారణాసి - టైమ్ ట్రాటర్ పార్ట్ 2' అంటూ అభిమానులు తమ ఊహాగానాలు మొదలుపెట్టేశారు.

అయితే ఈ ప్రచారాలన్నింటికీ తాజాగా రాజమౌళి స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'వారణాసి' సింగిల్ పార్ట్ సినిమా అని స్పష్టం చేశారు. కథ చాలా విస్తృతంగా ఉండటంతో ఒక దశలో రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన వచ్చిందని, కానీ వెంటనే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టామని తెలిపారు. ముఖ్యంగా, ఈ సినిమా మూడు గంటల కంటే తక్కువ రన్‌టైమ్‌తోనే విడుదల కానుందని క్లారిటీ ఇచ్చారు. తన సినిమాలు సాధారణంగా 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల మధ్య ఉంటాయని చెప్పారు.

అదే ఫార్మాట్‌లో 'వారణాసి' కూడా ఉండబోతుందని, ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సినిమా 'మూడు గంటల కంటే స్వల్పంగా తక్కువ రన్‌టైమ్‌తోనే విడుదల కానుందని'స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలన్నీ 3 గంటలకు పైగా నిడివితో వస్తున్న నేపథ్యంలో, జక్కన్న ఈసారి ఆ 'రూల్'ను బ్రేక్ చేయబోతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "కథ బలంగా ఉంటే నిడివి సమస్య కాదు... ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే మూడు గంటలు కాదు, మూడు నిమిషాలైనా చూస్తారు" అన్న రాజమౌళి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే-వారణాసి సినిమాలో మైథాలజీ టచ్ కీలకంగా ఉండబోతోంది. దాదాపు 25 నిమిషాల పాటు పురాణ నేపథ్యంతో సాగే సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి వెల్లడించారు. తన ప్రతి సినిమాలో రామాయణం, మహాభారతాల స్ఫూర్తి ఉంటుందని, ఈ సినిమాలో మాత్రం రామాయణంలోని ఒక భాగాన్ని నేరుగా చూపించబోతున్నామని చెప్పారు.

ప్రస్తుతం షూటింగ్ సుమారు 50 శాతం పూర్తయిందని, మరో ఆరు-ఏడు నెలల్లో మొత్తం షూటింగ్ ముగించేలా ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. IMAX ఫార్మాట్‌లో షూటింగ్, భారీ VFX, కాలాలు-ఖండాలు దాటి సాగే అడ్వెంచర్ స్టోరీ వంటి ప్రత్యేకతలతో 'వారణాసి'ని గ్లోబల్ రేంజ్‌లో నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది.

కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో, ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు రన్‌టైమ్ క్లారిటీ రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

More from Filmibeat

Read more about: Varanasi ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X