Varanasi: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్ బాబు మూవీ విడుదల ఆ రోజే!

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ పాన్ వర్డల్ మూవీ రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది . రెండు నెలల క్రితం టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న చర్చ సాగుతోంది. షూటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, రిలీజ్ డేట్‌పై ముందుగానే బజ్ క్రియేట్ చేయడం రాజమౌళి స్టయిల్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ వారణాసి. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పాన్ వరల్డ్ లెవెల్‌లో దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Varanasi Release Date Buzz Massive Hoardings Spark Curiosity Around Rajamouli-Mahesh Babu Film

ఇదిలా ఉండగా, తాజాగా వారణాసి పట్టణంలో ప్రత్యక్షమైన భారీ హోర్డింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో ఒక్కసారిగా వెలిసిన ఈ హోర్డింగ్స్‌లో సినిమా పేరు, నటీనటుల వివరాలు ఏవీ లేకుండా కేవలం "2027 ఏప్రిల్ 7న థియేటర్లలో" అని మాత్రమే మెన్షన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ హోర్డింగ్స్ ఫోటోలు వైరల్ కావడంతో అసలు ఇది ఏ సినిమా? ఎవరి ప్రాజెక్ట్? అనే ప్రశ్నలు నెటిజన్లను వెంటాడుతున్నాయి.

మరోవైపు.. ఈ హోర్డింగ్స్‌ను నిజంగానే మూవీ మేకర్స్ వేశారా? లేక ఫ్యాన్స్ స్వయంగా ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వారణాసి నగరమంతటా ఒకేసారి, అదే ఫాంట్‌, అదే స్టైల్‌తో హోర్డింగ్స్ కనిపించడం చూసిన చాలామంది ఇది మేకర్స్ ప్లాన్ చేసిన స్ట్రాటజీయేనని భావిస్తున్నారు. సాధారణంగా ఫ్యాన్స్ వేయించే హోర్డింగ్స్‌లో హీరో ఫోటోలు, సినిమా పేరు, అభిమాన సంఘాల పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం "2027 ఏప్రిల్ 7న థియేటర్లలో" అన్న ఒక్క లైన్ తప్ప మరే సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశం మేకర్స్ హస్తం ఉందన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

మరోవైపు, రాజమౌళి సినిమాలకు ఫ్యాన్స్ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది ఫ్యాన్స్ చేసిన పనై ఉండొచ్చని కూడా చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాకముందే బజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో, అభిమానులే ముందడుగు వేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద స్కేల్‌లో, ఒకేసారి నగరమంతా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం ఫ్యాన్స్‌కు సాధ్యమేనా? అన్న ప్రశ్న కూడా వెంటనే తలెత్తుతోంది.

ఇప్పటి వరకు ఈ హోర్డింగ్స్‌పై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. మేకర్స్ కావాలనే మౌనం పాటిస్తున్నారా? లేక ఇది నిజంగానే అనధికారికంగా జరిగిన వ్యవహారమా? అన్నది తెలియాల్సి ఉంది. ఇలా ఆ హోర్డింగ్స్ ఎవరు వేసినా సరే... వాటితో మాత్రం 'వారణాసి'పై ఆసక్తి, క్యూరియాసిటీ పీక్స్‌కు చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X