Varanasi: మహేష్ బాబు ‘వారణాసి’సెట్ రివీల్.. రాజమౌళి విజన్‌ ఇంత పెద్దదా?

Varanasi: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'(Varanasi). ప్రస్తుతం ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'RRR'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్టేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మ్యాటరేంటీ?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'. ఇక టెక్నాలజీ పరంగా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ VFX సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Varanasi Set Reveal SS Rajamouli s Grand Vision for Mahesh Babu Film Goes Viral

కథ పరంగా చూస్తే, 'వారణాసి' ఒక గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండబోతోందని సమాచారం. హాలీవుడ్ క్లాసిక్ 'ఇండియానా జోన్స్' తరహాలో హీరో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ సాహసాలు చేసే కథగా ఇది రూపుదిద్దుకుంటోంది. విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథలో ఆఫ్రికా అడవులు, పురాణాల్లోని హనుమంతుడి లక్షణాలు కీలక పాత్ర పోషించనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో అడ్వెంచరర్‌గా మారారు.ఈ మూవీ కోసం మహేశ్ బాబు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నారని సమాచారం.

లెటెస్ట్ గా వారణాసి మూవీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే.. ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న 'వారణాసి' నగరాన్ని ప్రతిబింబించే మినియేచర్ సెట్స్. ఘాట్లు, ఇరుకైన వీధులు, ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చాలా రియాలిస్ట్ గా ఉన్నాయి. ఈ సెట్స్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి విజన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఆధ్యాత్మిక నగరాన్ని రియలిస్టిక్‌గా చూపించడం చాలా కష్టం. కానీ రాజమౌళి మాత్రం తన డిటైలింగ్, విజువల్ గ్రాండియర్‌తో మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన యూనిట్, ప్రస్తుతం కాశీ సెట్‌లో షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారంట. ఇక అనంతరం అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో మిగతా భాగం షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'వారణాసి' సినిమా కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించే ప్రాజెక్ట్‌గా మారబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ కాగా, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెరపై ఎలా కనిపిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X