“నా పని అయిపోయింది”.. వారణాసి పై పృథ్వీ ఎమోషనల్ కామెంట్స్ !

Varanasi Update: ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోన్న మూవీ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీపై ప్రారంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. అలా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటీ?

రాజమౌళి స్టైల్.. పర్ఫెక్షన్ కోసం
రాజమౌళి పని తీరుకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక సీన్ తనకు నచ్చే వరకు పదేపదే షూట్ చేయించడం, నటినటుల నుండి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టడం ఆయన స్టైల్. అందుకే ఆయనను 'పని రాక్షసుడు'అని పిలుస్తారు. 'వారణాసి' వంటి భారీ ప్రాజెక్ట్‌లో కూడా అదే కట్టుదిట్టమైన పని విధానం కొనసాగుతుందని యూనిట్ సభ్యుల మాటల్లో స్పష్టమవుతోంది.

Varanasi Update Prithviraj Wraps Kumbha Role Mahesh Babu Rajamouli Film Gears Up for Release

ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సుమారు రూ.1300 కోట్ల వ్యయంతో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో వారణాసి ఒకటిగా ఇది నిలవనుంది.

ఏడాది ముందే హైప్.. రిలీజ్ డేట్ ఫిక్స్
మూవీ మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న 'వారణాసి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేస్తూ 'ఒకవేళ కాలయానం చేసి ఏడాది ముందుకు వెళ్తే ఈ సమయానికి మనం ఈ సినిమా చూస్తాం... ఇట్స్ షో టైం' అంటూ హైప్ చేశారు. ఇక సంగీత దర్శకుడు M. M. కీరవాణి "365" అని చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. దీనికి స్పందించిన S. S. Karthikeya "పాట ఎప్పుడు వస్తుంది?" అని అడగగా, యూనిట్ నుంచి వచ్చిన పోకిరి స్టైల్ రిప్లై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో త్వరలోనే ఫస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్.

ఇక భారీ బడ్జెట్ మూవీలో మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. 'కుంభ'అనే పవర్ పుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తనకు సంబంధించిన కీలక షెడ్యూల్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఈ ప్రయాణం తనకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ షెడ్యూల్ కోసం చాలా కష్టపడ్డాను. నా పని అయిపోయింది. పని పూర్తికాగానే డైట్‌ను పక్కనపెట్టి నచ్చిన ఫుడ్ తిన్నాను' అంటూ రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో పనిచేయడం ఎంత కష్టమో మరోసారి ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

అంచనాలు తారా స్థాయిలో
'వారణాసి' నుంచే వచ్చే ప్రతి అప్‌డేట్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సంపాదిస్తోంది. మహేష్ బాబు స్టార్డమ్, రాజమౌళి విజన్, పృథ్వీరాజ్ విలన్ పాత్ర ఈ మూడు కలిసి ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలా రికార్డులను క్రియేట్ చేయబోతుంది. మహేశ్ బాబు కెరీర్ లో ఈ మూవీ ఎలాంటి ఇన్ఫాక్ట్ క్రియేట్ చేయబోతుందని? అనే ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X