Prabhas Marriage: ఆమె మనసులో ప్రభాస్.. బాలీవుడ్ హీరో లీక్ చేయడంతో పెళ్లి టాపిక్ వైరల్

టాలీవుడ్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకున్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని మరోసారి వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం ప్రభాస్ ఒక అమ్మాయి మనసులో బలంగా పాతుకుపోయాడు అని హింట్ అయితే ఇచ్చేసాడు. దీంతో బాలీవుడ్ మీడియాలోనే కాకుండా టాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 గతంలోనే సెటైర్

గతంలోనే సెటైర్

ప్రభాస్ రేంజ్ పెరుగుతున్న కొద్దీ పెళ్లి వార్తలు కూడా ఎక్కువవుతూనే ఉన్నాయి. మొదట్లో అయితే అనుష్క పేరు ఎక్కువగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ గాసిప్ పై ప్రభాస్ అనుష్క కూడా చాలా ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు. అనుష్క అయితే తనకు ప్రభాస్ మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పింది. ఇక ప్రభాస్ అయితే ఇద్దరిలో ఎవరు ఒకరికి పెళ్లి అయితే తప్పితే ఈ వార్తలకు ముగింపు పలకరు అని సెటైర్ కూడా వేశాడు.

మరో గాసిప్

మరో గాసిప్

ఇక అనుష్క ప్రభాస్ లపై ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఆ తర్వాత వాటిపై ఆసక్తి కూడా జనాల్లో తగ్గిపోయింది. ఎందుకంటే వాటిలో నిజం లేదని అనుకున్నారు. ఇక మధ్యలో అయితే ప్రభాస్ మరొక బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ విషయంలో కూడా మళ్లీ ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు. కానీ చాలాసార్లు మాత్రం కృష్ణంరాజు ఫ్యామిలీ ప్రభాస్ కు పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు.

హీరోయిన్ మనసులో ప్రభాస్

హీరోయిన్ మనసులో ప్రభాస్

ఇప్పుడు ప్రభాస్ మరొక హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయితో అతను ప్రేమలో ఉన్నాడు అని ఆ నటి కొందరి స్టార్ సెలబ్రెటీలతో కూడా విషయాన్ని చెప్పినట్లుగా కూడా వార్తలు ప్రచారాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మరొక బాలీవుడ్ హీరో ఆ హీరోయిన్ పేరు చెబుతూ ఒక హింట్ అయితే ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

 ఆమె మనసులో స్టార్ హీరో

ఆమె మనసులో స్టార్ హీరో

ఇటీవల బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బెడియా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కృతి సనోన్ గురించి చెబుతూ.. ప్రస్తుతం ఆమె మనసులో ఒక స్టార్ హీరో ఉన్నాడు అని అతనితో ప్రస్తుతం దీపిక పదుకొనే సినిమా షూటింగ్లో ఉంది అని చెప్పకనే చెప్పేశాడు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం దీపికతో ప్రభాస్ ప్రాజెక్టు K సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

చెప్పకనే చెప్పేశాడు..

ఇక వరుణ్ ధావన్ ఆ విధంగా స్పందించడంతో కృతి సనోన్, ప్రభాస్ కు సంబంధించిన వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. మీరు ఇద్దరి కలిసి ఆదిపురుష్ సినిమాలో కూడా రాముడు సీతగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్లోనే చాలా మంచి స్నేహితులు అయ్యారని ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారు అనే విధంగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయంలో పెద్దగా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు. జస్ట్ వరుణ్ ధావన్ ఆమె మనసులో ఆ హీరో బలంగా ఉన్నాడు అని ప్రభాస్ పేరు చెప్పకుండానే ఒక క్లారిటీ ఇచ్చాడు. మరియు కృతి సనన్ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X