సీక్రెట్ కెమెరాతో ఆ ఫోటోలు... నా భార్యకి పంపి, తెలుగు హీరో షాకింగ్ కామెంట్స్

హోటల్స్, మాల్స్, వాష్‌రూమ్‌లు, స్కూళ్లు, కాలేజీలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఓ మూడో కన్ను మనుషుల్ని వెంటాడుతోంది. అదే సీక్రెట్ కెమెరా.. ఈ హిడెన్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి మహిళల్ని వేధిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. వీటి బారినపడకుండా ఎలా ఉండా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశంపై పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ నిత్యం ఎక్కడో ఒక చోటు ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా ఇలాంటి సీక్రెట్ కెమెరా బాధితులే. పలువురు సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ తెలుగు హీరో ఈ సీక్రెట్ కెమెరా ఉదంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

లవర్‌ బాయ్‌గా వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మరో చరిత్ర, ఎవరైనా ఎపుడైనా తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా దూసుకొచ్చాడు వరుణ్ సందేశ్. అయితే మధ్యలో వరుస ఫ్లాపులు ఎదురుకావడంతో తన సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఏవేవో సినిమాలు తీసినా అవి హిట్ కాలేపోయాయి. దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చిన వరుణ్ సక్సెస్ కాలేకపోయాడు. సెకండ్ లీడ్ రోల్స్, హీరో ఫ్రెండ్ రోల్స్ కూడా చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. అయినప్పటికీ నిరాశ పడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు.

Varun Sandesh and Ali Reza Share Shocking Experiences with Hidden Camera

హిట్ కోసం పోరాటం
బుల్లితెరపై అడుగుపెట్టి.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వితికా శేరును పెళ్లాడారు వరుణ్ సందేశ్. గతేడాది తను ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాజి చిత్రం ఫ్లాప్ కావడంతో ఆయన బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత కానిస్టేబుల్ అంటూ పలకరించినా ప్రజల నుంచి అంతగా స్పందన దక్కలేదు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నయనం అనే వెబ్ సిరీస్‌లో నటించారు. స్వాతి ప్రకాశ్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఉత్తేజ్, అలీ రెజా, ప్రియాంక జైన్, రేఖా నిరోషా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

డిఫరెంట్‌గా నయనం
ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరిలు ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిసెంబర్ 19న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఆరు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నయనం వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌‌లో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రెజాలు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము ఎదుర్కొన్న సీక్రెట్ కెమెరాల అనుభవాన్ని పంచుకున్నారు.

అడిగి ఫోటో తీసుకోవాలి
హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పెట్టడం అలాంటి ఘటనలు జరగలేదు కానీ, ప్రైవేట్ ప్లేస్‌లో, ప్రైవేట్ స్పేస్‌లో ఉన్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచో హిడెన్‌గా ఫోన్ తీసుకుని, కెమెరాతో రికార్డ్ చేయడం అలాంటివి నా జీవితంలో చాలాసార్లు జరిగాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేక మరో చోట ఉన్నప్పుడు దూరం నుంచి ఎవరో ఫోటోలు తీసేవారు. అడిగి ఫోటో తీసుకుంటే ఓకే. కానీ దూరం నుంచి కెమెరా పెట్టి తీయడం కరెక్ట్ కాదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఒకసారి చుట్టూ చూసుకుంటా. ఎందుకంటే నా ఫ్యామిలీ భద్రతే నాకు ముఖ్యమని అన్నారు.

ఆ ఫోటోలు మా వైఫ్ దగ్గరికి
మరోసారి నేను ఒకరోజు షూటింగ్‌లో ఉన్నా.. అక్కడి నుంచి వెళ్లబోతుండగా మా ఫ్రెండ్ కొంచెం మీరు వస్తే బాగుంటుందని ఓ క్లబ్‌కి పిలిచాడు. అక్కడ ఎవరో ఒకరు హిడెన్‌గా కెమెరా పెట్టి నా వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి నన్ను ట్యాగ్ చేశారు. కరెక్ట్‌గా అప్పుడే నేను బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చా. ఆ సమయంలో నాకు ఫ్యాన్ పేజీలు ఉండటంతో వాటిలో ఆ ఫోటోలు చక్కర్లు కొడుతూ తిరిగి తిరిగి మా వైఫ్ దగ్గరికి వచ్చాయి. దాంతో ఎక్కడున్నావ్? ఈ ఫోటోలు ఏంటీ? అని మా ఆవిడ నిలదీసింది అని అలీ రెజా తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హిడెన్, సీక్రెట్ కెమెరాలతో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X