బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ కపుల్స్.. ఇద్దరూ ఒకేసారి..

గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో పద్నాలుగు, పదిహేనో కంటిస్టెంట్‌గా వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక షేరు ఒకేసారి అడుగు పెట్టారు. వీళ్లిద్దరిని బిగ్ బాస్ హౌస్‌లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. వీళ్ల గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

 Varun Sandesh and His Wife Vithika Sheru Enters Into the Bigg Boss House

వరుణ్ సందేశ్.. యంగ్ హీరోగా ఇతను ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. 'హ్యాపీడేస్' సినిమాతో వెండితెరపై కాలుమోపిన ఈయన.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకాదరణ పొందాడు. ఒడిషాలోని రాయగడలో జన్మించిన ఈయన సినిమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఇక్కడే సెటిలైపోయాడు. బిగ్ బాస్ హౌస్‌లో యువ హీరోగా వరుణ్ సందేశ్ సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు.

వితిక షేరు.. ఈమె హీరో వరుణ్ సందేశ్ భార్య. ఈమె తెలుగు అమ్మాయి. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన వితిక షేరు.. ఆ తరువాత వరుణ్ సందేశ్‌తో కలిసి 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన వరుణ్ సందేశ్- వితిక షేరు ఆ తర్వాత పెళ్లి పీటలెక్కి ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే వితిక షేరు.. భర్త వరుణ్ తో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

 Varun Sandesh and His Wife Vithika Sheru Enters Into the Bigg Boss House

స్టేజ్‌పై వీళ్ల ప్రేమకథను అడిగారు నాగార్జున. దీనికి వితిక సమాధానం చెప్పింది. ''మేమే ఓ సినిమా షూటింగ్ సమయంలో కలిశాం. కానీ, ఇద్దరం మూడు నెలలు మాట్లాడుకోలేదు. కానీ, మలేషియా షెడ్యూల్ వెళ్లినప్పుడు ప్రపోస్ చేశాడు. పెళ్లి చేసుకునేటట్లు ఉంటేనే ప్రేమించుకుందాం అని చెప్పాను. తర్వాత ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం'' అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నాగ్‌కు హగ్ ఇచ్చి వెళ్లబోయారు. కానీ, ఆయన.. వితికను ఎత్తుకుని వెళ్లమని వరుణ్‌కు చెప్పాడు. దీంతో వరుణ్ ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X