మరోసారి జాకెట్ లేకుండా షాక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ హీరోయిన్.. మొదటి సినిమాకే డేరింగ్ స్టెప్!
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటులలో వరుణ్ సందేశ్ ఒకరు. సింపుల్ గా కాలేజ్ అబ్బాయిలా కనిపించే వరుణ్ ఎక్కువగా రొటీన్ సినిమాలే చేయడం వల్ల నిలదొక్కుకోలేకపోతున్నాడు. అందుకే ఈసారి కాస్త విబిన్నంగా ట్రై చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఒక డిఫరెంట్ కథను సెలెక్ట్ చేసుకోగా చిత్ర యూనిట్ పోస్టర్స్ తోనే షాక్ ఇస్తోంది. ఇందువదన అనే ఆ సినిమాలో కొత్తమ్మాయి నటిస్తుండగా బోల్డ్ లుక్స్ తో మరోసారి షాక్ ఇచ్చింది.

ఎన్ని సినిమాలు చేసినా కూడా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో వరుణ్ మెయిన్ లీడ్ లో కనిపించి అందరికంటే కాస్త ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు. అయితే ఆ సినిమా అనంతరం కొత్త బంగారు లోకం తప్పితే ఎక్కువగా సక్సెస్ ట్రాక్ ను అందుకోలేకపోయాడు. ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అంసుకున్నాయి.

కంటిన్యూగా సినిమాలు
ఏమైంది ఈ వేళ హిట్టయిన అనంతరం వరుసగా ఐదారు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. గత పదేళ్లలో దాదాపు 16 సినిమాల వరకు కాంటిన్యూగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఏ సినిమా కూడా అతన్ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకు రాలేకపోయింది. ఇక మరికొన్ని సినిమాలు అయితే సెట్స్ పైకి వచ్చి మధ్యలోనే ఆగిపోయాయి.

ఈసారి.. ఇందువదన
మధ్యలో భార్యతో కలిసి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం ఇందువదన అనే సినిమా చేస్తున్న వరుణ్ సందేశ్ ఎదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా ఇందు అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు.

మరోసారి షాక్ ఇచ్చిన హీరోయిన్
ఇంతకుముందు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఒకటి విడుదల కాగా అందులో వరుణ్ సందేశ్ హీరోయిన్ ను కౌగిలించుకున్నట్లు ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ జాకెట్ లేకుండా చీర కొంగును అడ్డుపెట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. ఇందులో ఆమె గిరిజన అమ్మాయిలా కనిపించనుందట. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు క్లిక్కవుతుందో చూడాలి. వరుణ్ సందేశ్ అయితే ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఎస్ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











