మొత్తానికి పూర్తిచేసిన వరుణ్ తేజ్.. అప్‌డేట్ ఇచ్చిన మెగా వారసుడు
ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్.. తన తర్వాతి సినిమాను కూడా వేగంగా పూర్తిచేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో 10వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. వైజాగ్ షూటింగ్‌లో ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. ఈ మేరకు సముద్రం ఒడ్డున కూర్చున్న తన పిక్ షేర్ చేశారు వరుణ్.
వరుణ్ తేజ్ తన కెరీర్ లో తొలిసారి బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

హీరోయిన్ ఎవరనేది తెలియరాలేదు. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ వరకు హీరోయిన్ పేరు ప్రకటించి ఆమెను సెట్స్ మీదకు తీసుకురానున్నారని తెలిసింది. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











