twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక రెడ్డి హత్య.. ఆ ఆలోచనకే భయపడాలి.. వరుణ్ తేజ్, అక్షయ్ కుమార్ రియాక్షన్

    |

    హైదరబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యకు వ్యతిరేకంగా అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు అంతకంతకూ పెరుగుతూ ఉండగా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనను ఖండిస్తూనే.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులనే వెంటనే శిక్షిస్తే.. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలంటే మిగతా వారు బయపడతారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు ఈ ఘటనను ఖండిస్తూ ఎమోషనల్ ట్వీట్లు చేస్తున్నారు.

    మూగబోయాను..

    ప్రియాంకరెడ్డిపై జరిగిన దారుణాన్ని విని, చదివి మూగబోయానని, ఇలాంటి ఘోరాన్ని చేసిన నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ప్రముఖ నిర్మాత మధుర్ భండార్కర్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ప్రియాంకకు న్యాయం జరగాలని, ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు.

    ఇలాంటి వాటిని ఆపాలి..

    హైద్రాబాద్‌లోని ప్రియాంక, చెన్నైలో రోజా, రాంఛీలో గ్యాంగ్ రేప్ అయిన వీటన్నంటినీ చూస్తుంటే ఇది సమాజమేనా? అని అనిపిస్తోందని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అవుతోంది.. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.. చట్టాలను ఇంకా కఠినతరం చేయాలి.. ఇలాంటి వాటన్నంటిని ఆపాలి అంటూ అక్షయ్ కుమార్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

    ఆ ఆలోచనకే భయపడాలి..

    డాక్టర్ ప్రియాంకకు జరిగింది విని చాలా బాధపడ్డాను.. నిందితులకు కఠినంగా శిక్ష పడుతుందని భావిస్తున్నాను.. ఇలాంటివి చేయాలనే ఆలోచనే రాకుండా ఉండేంత భయకరంగా శిక్షించాలని వరుణ్ తేజ్ కోరాడు. ప్రియాంక రెడ్డికి న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు.

    అలాంటివారిని ఏరిపారేయాలి..

    ప్రియాంక రెడ్డి ఘటన విని షాక్‌కు గురయ్యాను. త్వరితగతిన న్యాయం చేకూరుతుందని నిందితులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను.. ఇలాంటి జంతువులను ఏరి పారేయండి.. ఇంకెవరికీ ఇలాంటి దుస్థితి రాకూడదు.

    English summary
    Varun Tej And Akshay Kumar Reaction On Priyanka Reddy Murder.Really disturbed and saddened on hearing the dreadful news of Dr.Priyanka. Hope the law comes up with the most severe punishment to these culprits and instill fear into the heads of anyone who might even think of committing such atrocities!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X