Varun Tej's Haldi Function.. స్టయిల్‌తో మెగాస్టార్ చిరంజీవి.. వరుణ్, లావణ్య ఫోటోలు వైరల్
ఇటలీలో మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పెళ్లికి ముందు జరుగాల్సిన కాక్ టెయిల్ పార్టీని అక్టోబర్ 30వ తేదీ సోమవారం గ్రాండ్‌గా ముగించారు. ఇక పెళ్లిలో భాగంగా జరిగే హల్దీ, మెహందీ,సంగీత్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి వివరాల్లోకి వెళితే...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ ఇటలీకి వెళ్లిన విషయం తెలిసింది. ఇటలీలో కొణిదెల, కామినేని కుటుంబాలు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ సభ్యులు వివాహ వేడుకులను ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

హల్దీ ఫంక్షన్ కోసం ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లోని ప్యాలెస్‌ను ముస్తాబు చేశారు. ఆ ప్యాలెస్ ఆవరణలో వేసిన వేదిక ఆకర్షణీయంగా కనిపించింది.కొణిదెల ఫ్యామిలీ అంతా పసుపు పచ్చని దుస్తులు ధరించి వేడుకలకు సిద్దమయ్యారు.

వరుణ్ తేజ్ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. నీటుగా షేవ్ చేసుకొని పసుపు పచ్చ కుర్తా ధరించి.. స్టయిల్‌గా గాగుల్స్ పెట్టుకొని హుందాగా ఫోజిచ్చారు. ఇక నాగబాబు దంపతులు ఉత్సాహం, ఆనందంతో ఫోటోలకు ఫోజిచ్చారు.

ఇక నూతన వధూవరులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హల్దీకి సిద్దమయ్యారు. లావణ్య త్రిపాఠిని ప్రేమగా కౌగిలించుకొని కనిపించాడు. ఇద్దరు పసుపు పచ్చని దుస్తుల్లో మెరిపిసోయారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే వరుణ్, లావణ్యను కుర్చీలపై కూర్చోబెట్టి వారిని మెగా దంపతులు చిరంజీవి, సురేఖ ఆశీర్వదించారు.

ఇక హల్దీ ఫంక్షన్ ముగిసిన తర్వాత మెహందీ ఫంక్షన్ వేడుక ప్రారంభం కానున్నది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ రెడీ అవుతున్నారు. అనంతరం ఈ వేడుక తర్వాత సంగీత్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు.

అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1వ తేదీన అర్ధరాత్రి వేద పండితులు నిర్ణయించిన ముహుర్తాన్ని అనుసరించి నిర్వహించనున్నారు. వీరి పెళ్లి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ప్రకారం.. 2.48 గంటలకు వివాహం జరుగుతుంది. ఇప్పటికే గ్రాండ్‌గా పెళ్లి మండపం, రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రిసెప్షన్ కూడా జరుగుతుంది.


Click it and Unblock the Notifications











