Operation Valentine Teaser: విజ్యువల్ వండర్ గా వాలెంటైన్ టీజర్.. అదిరే కథతో ఆసక్తి రేకెత్తిస్తున్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. అతి తక్కువ కాలంటో స్టార్ హీరోగా మారిపోయాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ముందుకెళ్తున్న ఇతడు ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తాడు. ఆ ఆసక్తితోనే అనేక కొత్త కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలు హిట్టుగా నిలిచినా, ఫ్లాప్ అయినా పెద్దగా పట్టించుకోకుండా.. వరుసగా చిత్రాలు చేస్తున్నాడీ హీరో. చివరగా గాండీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని పొందాడు.

ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలన్నా కసితో ఓ సినిమా చేశాడు. ముఖ్యంగా ఈ చిత్రం ఆయనకు 13వది. ఈ సినిమాకు ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరును ఖరారు చేశారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ముఖ్యంగా భారత వైమానిక దళానికి నివాళులర్పించేలా.. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రెనాయ్ సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న తాజా సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

Varun Tej And Manushi Chillar New Movie Operation Valentine Teaser Outnow Check Details

మన ఎయిర్ ఫోర్స్ ను ఇంకో దేశంలోకి పంపించడం అంటే ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ వార్.. ఇలా ప్రతీకారాలు తీర్చుకుంటూ పోతే దేశాలు అనేవి ఉండవు, బార్డర్స్ మాత్రమే ఉంటాయి.. అనే డైలాగ్ తో ఆపరేన్ వాలెంటైన్ టీజర్ ప్రారంభం అయింది. ఇక ఆ తర్వా కశ్మీర్ ను చూపించారు. మంచు కొండల వద్ద దళాలను కూడా చక్కగా తెరపై కనిపించేలా చేశారు. ఇక ఆ తర్వాత హీరో వరుణ్ తేజ్ ను చాలా పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో చూపించారు. ముఖ్యంగా.. శత్రువులకు ఓ విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది... మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా అంటూ చెబుతూ హీరో కనిపించాడు. ఈ డైలాగ్ ను బట్టి చూస్తుంటే.. వరుణ్ తేజ్ వార్ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

Varun Tej And Manushi Chillar New Movie Operation Valentine Teaser Outnow Check Details

వైమానికి దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలను, దేశాన్ని కాపాడడంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను అద్భుతమైన విజ్యువల్స్ తో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. అలాగే హీరో వరుణ్ తేజ్ అక్కడే పని చేసే మానుషి చిల్లర్ తో ప్రేమాయణం సాగించబోతున్నట్లు కూడా తెలస్తోంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ యే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X