గాలి సంపత్ ట్రైలర్.. మెగా హీరోల రియాక్షన్ హైలెట్
అనిల్ రావిపూడి శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాను కథ, మాటలు అందించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన చిత్రం గాలి సంపత్. తన స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్ రావిపూడి సమర్పించిన ఈ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ప్రస్తుతం గాలి సంపత్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసేసుకుంది.
రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు కాంబోలో వస్తోన్న గాలి సంపత్ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన టీజర్‌పై టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శక నిర్మాతలు, హీరోలు అందరూ కూడా ట్వీట్లు వేస్తున్నారు. అందులో మెగా హీరోలైనా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు గాలి సంపత్ గురించి ట్వీట్లు వేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధం, ఆ బంధం ఎప్పుడూ ప్రత్యేకమే అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.


అంతే కాకుండా ఈ సినిమాలో ఎంత వినోదం ఉందనే విషయాన్ని ఈ చిన్న టీజరే చెబుతోంది. రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ విష్ణు ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. గాలి సంపత్ టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక వరుణ్ తేజ్ స్పందిస్తూ. లవ్లీ ట్రైలర్.. కచ్చితంగా విజయం సాధిస్తుందని అనిపిస్తోంది.. గాలి సంపత్ టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ వేశాడు. ఈ ఇద్దరూ కూడా అనిల్ రావిపూడి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











