BRO Pre Release Event మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఒకే స్టేజ్ మీద మెగా హీరోలందరూ.. ఎవరెవరూ వచ్చారంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో (BRO The Avatar) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అంగరంగ వైభవంగా జరుగుతున్నది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సినీతారలతో జిగేల్ మనిపించింది. ఈ వేడుకకు కేతిక శెట్టి, ఊర్వశి రటేలా, ప్రియా ప్రకాశ్ వారియర్, యువలక్ష్మి, ఎస్ థమన్, టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఇంకా నిర్మాతలు ఏఎం రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, నిమ్మకాయల ప్రసాద్ హాజరయ్యారు.
బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరూ ఊహించని విధంగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వచ్చారు. దాంతో వారిని చూడగానే మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేసింది. వేదిక మొత్తం అభిమానులు ఆనందంతో వేసిన అరుపులు, కేకలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్‌కు చిత్ర యూనిట్‌తోపాటు దర్శకుడు సముద్రఖని సాదరంగా ఆహ్వానం పలికారు.

More from Filmibeat
pawan kalyan sai dharam tej trivikram srinivas priya prakash varrier ketika sharam పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రియా ప్రకాశ్ వారియర్ కేతిక శర్మ


Click it and Unblock the Notifications











