HBD Varun Tej: మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పవర్ చూపించిన గని

నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. స్టార్ స్టేటస్‌ను కూడా సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నాడు. తద్వారా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

వరుస విజయాలను అందుకుంటూ భీకరమైన ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో క్లైమాక్స్‌ పార్టుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరాయి.

Varun Tej Birthday Special Ghani Glimpse Video Released

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌ 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ కంప్లీట్ కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.

'గని' మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతున్నప్పటికీ.. మెగా అభిమానులు నిరాశ చెందకుండా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ దీని నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పాటలు, టీజర్ వీడియోలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈరోజు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'గని' మూవీ స్పెషల్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో హీరో పాత్రను ఎలివేట్ చేసి చూపించారు. దీంతో ఈ వీడియో అన్ని వర్గాల వాళ్లనూ అలరిస్తూ మంచి స్పందనను అందుకుంటోంది.

'గని'లో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X