twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘F3’ ఆ హీరో రోల్ కూడా అదుర్స్: మరో యాంగిల్ చూపించేందుకు డైరెక్టర్ ప్లాన్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎన్నో వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. వాటిలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా భాటియా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను కూడా తీస్తున్న విషయం తెలిసిందే.

    'F2'ను పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను వివరిస్తూ తెరకెక్కించగా.. 'F3'ని మాత్రం డబ్బు వల్ల ఒక కుటుంబంలో వచ్చే సమస్యలను గురించి రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి భాగంలో వరుణ్ తేజ్‌తో పోలిస్తే.. విక్టరీ వెంకటేష్ పాత్రకు ఎక్కువగా కామెడీ టచ్ ఇచ్చాడు. ఇక, రెండో భాగంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని.. ఇందుకోసం వెంకీ క్యారెక్టర్‌కు రేచీకటి సమస్య ఉన్నట్లు చూపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాలో మళ్లీ ఆయనే హైలైట్ అవుతాడని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటికొచ్చింది.

     Varun Tej Comedy Highlight in F3

    తాజా సమాచారం ప్రకారం.. 'F3'లో వరుణ్ తేజ్ కూడా కామెడీ చేయబోతున్నాడట. ఇందుకోసం అతడికి స్పెషల్ ట్రాక్‌ను డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. ఇది వెంకటేష్ కంటే ఎక్కువ నవ్విస్తుందని అంటున్నారు. అతడిలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించడంతో పాటు సినిమాకు ప్లస్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 'F3'తో ఇద్దరు హీరోలు ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని అర్థం అవుతోంది.

    English summary
    Daggubati Venkatesh, Varun Tej Doing F3 Movie under Anil Ravipudi Direction. In This Movie Mega Prince Comedy Will Be Highlight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X