Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘F3’ ఆ హీరో రోల్ కూడా అదుర్స్: మరో యాంగిల్ చూపించేందుకు డైరెక్టర్ ప్లాన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎన్నో వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. వాటిలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా భాటియా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను కూడా తీస్తున్న విషయం తెలిసిందే.
'F2'ను పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను వివరిస్తూ తెరకెక్కించగా.. 'F3'ని మాత్రం డబ్బు వల్ల ఒక కుటుంబంలో వచ్చే సమస్యలను గురించి రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి భాగంలో వరుణ్ తేజ్‌తో పోలిస్తే.. విక్టరీ వెంకటేష్ పాత్రకు ఎక్కువగా కామెడీ టచ్ ఇచ్చాడు. ఇక, రెండో భాగంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని.. ఇందుకోసం వెంకీ క్యారెక్టర్‌కు రేచీకటి సమస్య ఉన్నట్లు చూపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాలో మళ్లీ ఆయనే హైలైట్ అవుతాడని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటికొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'F3'లో వరుణ్ తేజ్ కూడా కామెడీ చేయబోతున్నాడట. ఇందుకోసం అతడికి స్పెషల్ ట్రాక్‌ను డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. ఇది వెంకటేష్ కంటే ఎక్కువ నవ్విస్తుందని అంటున్నారు. అతడిలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించడంతో పాటు సినిమాకు ప్లస్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 'F3'తో ఇద్దరు హీరోలు ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని అర్థం అవుతోంది.