చిరంజీవి చెప్పారని చేశా.. చివరకు పేరే మార్చేశారు.. వరుణ్ తేజ్ కామెంట్స్
థియేటర్స్‌లో గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతూనే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మొదట వాల్మీకిగా ప్రమోట్ అయింది. విడుదలకు ఒక్క రోజు ముందే గద్దలకొండ గణేష్‌గా వెండితెరపైకి వచ్చింది. ఓ రకంగా ఆ పేరు సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే విడుదల రోజు నుంచే ఈ సినిమా నిర్మాతలను ఖుషీ చేస్తూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుణ్ తేజ్ ఎక్కడికెళ్లినా ఆయనను గద్దలకొండ గణేష్ అనేస్తున్నారట. వరుణ్ పేరునే గద్దలకొండ గణేష్ గా మార్చేశారట. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గద్దలకొండ గణేష్ సినిమాకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, తాను ఎక్కడికి వెళ్లినా అంతా 'గద్దలకొండ గణేష్' అనే పిలుస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ముందుగా చిరంజీవి గారికి కథ చెప్పి.. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేశానని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే గడ్డలకొండ గణేష్ పాత్ర తనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నాడు వరుణ్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అందించిన విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











