బాబాయ్ పవన్‌కి ఇచ్చినంత కాకపోయినా కొంతైనా ఇచ్చారు.. వరుణ్ తేజ్

అనుకున్నట్లు గానే గద్దలకొండ గణేష్ గత్తర లేపేశాడు. సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన గద్దలకొండ గణేష్ థియేటర్స్‌లో జోరు కొనసాగిస్తూనే.. నేరుగా అభిమానులను కలిసి సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ టూర్‌ వేశాడు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులను పలకరించి చివరకు సక్సెస్ మీట్‌లో తనదైన మాటలతో ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి పోతే..

మాటలతో ఆకట్టుకున్న వరుణ్

మాటలతో ఆకట్టుకున్న వరుణ్

సెప్టెంబర్ 24వ తేదీన వరంగల్ నుంచి విజయోత్సవ యాత్ర చేపట్టిన గద్దలకొండ గణేష్ చిత్ర యూనిట్.. వైజాగ్‌లో ఈ యాత్ర ముగించారు. ఈ నేపథ్యంలో అక్కడే సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ఈ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో వరుణ్ మాటలు ఆకట్టుకున్నాయి.

అందుకే ఇలా ప్లాన్ చేశాం..

అందుకే ఇలా ప్లాన్ చేశాం..

'గద్దల కొండ గణేష్‌' సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేశామని అన్నాడు వరుణ్. తనకు సినిమాను పరిచయం చేసిందే వైజాగ్ అని, తాను నటనలో శిక్షణ తీసుకుంది కూడా ఇక్కడే అని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు వరుణ్ తేజ్. గద్దల కొండ గణేష్‌ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పాడు వరుణ్.

పవన్‌ అంత పెద్దది కాకపోయినా

పవన్‌ అంత పెద్దది కాకపోయినా

ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి 'గబ్బర్ సింగ్' రూపంలో ఎంత మంచి హిట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు అంటూ డైరెక్టర్‌ని, తన బాబాయ్ ని ఆకాశానికెత్తేశారు వరుణ్. అంత పెద్దది కాకపోయినా తనకు 'గద్దల కొండ గణేష్' రూపంలో మంచి హిట్ హరీష్ ఇవ్వడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

 గద్దలకొండ గణేష్ మూవీ

గద్దలకొండ గణేష్ మూవీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. విజయవంతంగా రెండో వారంలో ప్రవేశించిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X