Ghani: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్.. ఈ సారి పంచ్ మిస్ కాకుండా ప్లాన్
మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. స్టార్‌గా పేరు సంపాదించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు, కొంత కాలంగా కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూనే ఉన్నాడు. తద్వారా రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా లేట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో క్లైమాక్స్ పార్టుకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేసేశారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఇవన్నీ చివరి దశకు చేరుకున్నాయి.

వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన దీన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా ఈ ఏడాది మార్చి 18కి వాయిదా వేసేశారు. ఇటీవలే కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
'గని' సినిమాను ఈ సారైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చాలా కసిగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో వరుణ్ తేజ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, స్టూడియోలో డబ్బింగ్ చెబుతోన్న ఓ పోస్టర్‌ను సైతం షేర్ చేశాడు. ఇక, ఇప్పటికే అతడు ఈ సినిమా నుంచి రిలీవ్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో 'గని' సినిమా పనులు కూడా చివరికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న 'గని'లో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర, నవీన్ చంద్రలు కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











