క‌రోనా క్రైసిస్ ఛారిటీ: సినీ కార్మికుల కోసం మెగా వారసుడి విరాళం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. దీంతో సినిమా ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించిపోవడం, సినీ కార్మికుల ఉపాధికి గండి పడటం జరిగాయి.

ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆడుకునెనుదుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో 'సి.సి.సి. మ‌న‌కోసం' (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని కోరారు.

Varun Tej contribution for Corona Crisis Charity

ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధికి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X