వంద మంది నిర్మాతలు తీసిన అరుదైన మూవీ, ఆదరించండి: వరుణ్ తేజ్
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా షార్ట్ ఫిలింమేకర్ ఫణీంద్ర నార్శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మను'. చాందినీ హీరోయిన్‌గా నటించింది. దాదాపు 115 మంది నుండి సేకరించిన ఫండ్‌తో నిర్మించిన ఈచిత్రాన్ని నిర్వాణ సినిమాస్ సమర్పణలో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులగా క్రిష్, వరుణ్ తేజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ... 'మను' ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సెప్టెంబర్ 7న ఈ సినిమా నేను తప్పకుండా చూస్తున్నాను. గౌతమ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఒకే కాలనీలో పెరిగాం. బ్రహ్మానందంగారు మా ఫ్యామిలీలో ఒకరిలా మెలిగేవారు. చిన్నపుడు స్కూల్ రోజుల్లో గౌతమ్ అన్నను చూసేవాడిని. చాలా కష్టపడే మనిషి. హీరో అవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. అడ్డంకులు వచ్చినా ఏ మాత్రం నిరాశ పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు 'మను' లాంటి ఒక మంచి సినిమాతో వస్తున్నారని తెలిపారు.

ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు సౌండ్, ఆర్ట్ వర్క్, కెమెరా ఇలా ప్రతి అంశం ఎంతో నచ్చింది. సినిమాలో ఏముంటుంది అనే క్యూరియాసిటీ పెంచింది. తెలుగులో ఇలాంటి సనిమాలు చాలా తక్కువగా వస్తాయి. చాలా సినిమాలు నాలుగు ఫైట్లు, నాలుగు సాంగులతో వస్తాయి. హిట్ అవుతుంటాయి. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి. ఇలాంటి మంచి సినిమాను మీరందరూ ఆదరించాలని వరుణ్ తేజ్ కోరారు.
ఈ సినిమా క్రౌడ్ ఫండింగుతో చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దాదాపు 115 మంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నట్లు వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.
రాజా గౌతమ్, చాందిని చౌదరి, జాన్ కొటొలి, మోహన్ భగత్, అభిరామ్, శ్రీకాంత్ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్: శివ్‌కుమార్, సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్, సంగీతం: నరేష్ కుమారన్, నిర్మాణం: క్రౌడ్ ఫండింగ్ మూవీ(115 మెంబర్స్), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్శెట్టి.


Click it and Unblock the Notifications











