Gandeevadhari Arjuna: భారీ గన్‌తో వరుణ్ తేజ్.. ఫుల్ యాక్షన్‌తో 'గాండీవధారి అర్జున' ప్రీ టీజర్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. బాలనటుడిగా సినిమాలు మొదలు పెట్టిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత విభిన్నాత్మక సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలతో ఫ్లాపులు చూస్తున్న వరుణ్ తేజ్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna). ఇదివరకు ఈ మూవీ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ప్రీ టీజర్ వదిలారు.
వరుణ్ తేజ్ చివరిగా నటించిన చిత్రం గని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బెడిసికొట్టింది. ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఆయన కూడా చివరిగా నాగార్జున ది ఘోస్ట్ మూవీ తెరకెక్కించారు. అది కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. దీంతో ఈ ఇద్దరు ఎలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే గాండీవధారి అర్జున.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న గాండీవధారి అర్జున సినిమాలో ఏజెంట్ బ్యూటి సాక్షి వైద్య హీరోయిన్ గా చేస్తోంది. ఎస్వీసీసీ బ్యాన్ర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఇందులో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు.
గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ ప్రీ టీజర్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉంది. వరుణ్ తేజ్ కారులో స్పీడుగా వస్తుండటంతో వీడియో స్టార్ట్ అయింది.
తర్వాత కారు దిగగనే అందులో భారీ గన్స్ చూపించారు. దానిలో ఒక పెద్ద గన్ తీసుకుని తో శత్రువులను వేటాడుతున్నట్లుగా టీజర్ చూపించారు. ఇందులో వరుణ్ తేజ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతోపాటు స్టైలిష్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లుగా ఈ ప్రీ టీజర్ తో హింట్ ఇచ్చారు. ఇక ప్రీ టీజర్ గురించి సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ స్పెషల్ నోట్ రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











