Ghani: బాక్సింగ్ రింగ్‌లో దిగేందుకు వరుణ్ రెడీ.. సెన్సార్ పూర్తి చేసుకున్న గని

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా ఎదిగిపోయాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే 'కంచె' మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న అతడు.. తన ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. అలా మొదట్లోనే చాలా విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న వరుణ్ తేజ్.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గని' అనే సినిమా చేస్తున్నాడు.

తన కెరీర్‌లోనే మాంచి ఫామ్‌లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా అవుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తవలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. దీంతో అప్పటి నుంచి చిత్ర బృందం ప్రమోషన్‌ను కూడా మొదలు పెట్టేసింది.

Varun Tejs Ghani Movie Gets U/A Certificate

'గని' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో దీని నుంచి అన్నీ వదులుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులకు చూపించారు. సినిమాను వీక్షించిన తర్వాత బోర్డు సభ్యులు దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ఇక, ఈ సినిమా రన్‌ టైం విషయంలో చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కానీ, దీని గురించి క్లారిటీ మాత్రం రావడం లేదు.

ఇదిలా ఉండగా.. 'గని' సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X