ట్విస్ట్ ఇచ్చిన వరుణ్ తేజ్.. అందరికంటే ముందుగానే రాబోతున్న గని!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా విడుదల తేదీలపై కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగా తగ్గిపోయింది. ఇక జనాలు కూడా ఎప్పుడూ థియేటర్స్ లోకి వస్తారో చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. ఇక దైర్యంగా కొంతమంది నిర్మాతలు హీరోలు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ ఇస్తున్నారు గాని ఫైనల్ గా విడుదలయ్యే వరకు కూడా ఒక నమ్మకం అయితే కలగడం లేదు. ఇక వరుణ్ తేజ్ గని సినిమా విడుదల విషయంలో మొన్నటివరకు ఆ చిత్ర యూనిట్ సభ్యులు సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు.
మెగా హీరో వరుణ్ తేజ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే వరుణ్ తేజ్ లాంటి మంచి ఎత్తు కలిగిన హీరో ఇప్పటివరకు ఫిట్నెస్ కు తగ్గట్టుగా యాక్షన్ పాత్రలు చేయలేదు. ఇక మొదటిసారి అతను ఎంతో ఇష్టంగా చేసిన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని మరి గని సినిమా చేశాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. ఇక అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక సినిమాను గత ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ హాలిడేస్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు రావడంతో గని వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఇక ఫిబ్రవరి 18న లేదా 24వ తేదీన గని సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి కూడా థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక గని సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మొన్నటివరకు అయితే ఇప్పట్లో సినిమాను విడుదల చేసే అవకాశం లేదని టాక్ వచ్చింది. మార్చి లేదా ఏప్రిల్ లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా చర్చలు జరిపారట. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని మరో ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశాడు. ఇక సమంత ఐటెమ్ సాంగ్ కూడా విడుదల చేయగా మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అంధించాడు. జగపతిబాబు, కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర కూడా సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కూడా ముమ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. సినిమాలో లవ్ స్టొరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











