గని సినిమా కోసం రెండు రిలీజ్ డేట్లు.. ఆ ఇబ్బంది లేకపోతే ఇదే నెలలో..
మొత్తానికి సమ్మర్లో లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాల విడుదల తేదీలు అయితే ఖరారయ్యాయి. వీలైనంత వరకు పోటీ లేకుండా సామరస్యంగా అందరూ విడుదల తేదీలని ఫిక్స్ చేసుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా అర్థమైంది. ఇక వరుణ్ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే F3 సినిమా ఏప్రిల్ 28న రానున్నట్లు ప్రకటన వచ్చింది. ఇక గని సినిమా కూడా విడుదలకు సిద్దమవుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడు. అసలైతే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అని అనుకున్నారు. కానీ అప్పుడు పుష్ప సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుండటంతో గని సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ పెద్ద కుమారుడు బాబి నిర్మిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఓటీటీ డిజిటల్ హక్కులకు కూడా మంచి ఆఫర్ వచ్చింది. దాదాపు పెట్టిన బడ్జెట్ అంతా కూడా అక్కడే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ విషయంలో అల్లు అరవింద్ కూడా తన కొడుకుకు చాలా సహాయం చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఫైనల్ గా నిన్న జరిగిన చర్చల అనంతరం గని యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన లేదా మార్చి 4న విడుదల చేయాలని అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25వ తేదీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు మారితే మాత్రం మార్చి 4వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. వీలైనంతవరకూ మిగతా సినిమాల నుంచి పోటీ లేకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ సభ్యులు కోరుకుంటున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టు ద్వారా వివరణ ఇచ్చారు. ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన సాంగ్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అలాగే ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. కన్నడ సీనియర్ నటుడు ఉపేంద్ర కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమా నెగెటివ్ రోల్ లో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే జగపతిబాబు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి


Click it and Unblock the Notifications











