Ghani Teaser: గెలిస్తేనే చరిత్రలో ఉంటావు.. టీజర్‌లో సర్‌ప్రైజ్ చేసిన రామ్ చరణ్

పేరుకు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచే భారీ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటోన్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గని' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

‘గని'గా మారిపోయిన వరుణ్ తేజ్

‘గని'గా మారిపోయిన వరుణ్ తేజ్

ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

షూట్ ఆలస్యం.. విడుదల వాయిదా

షూట్ ఆలస్యం.. విడుదల వాయిదా

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించింది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ప్రమోషన్ షురూ.. పరిచయం చేసి

ప్రమోషన్ షురూ.. పరిచయం చేసి

'గని' సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన పాత్రలు.. ఆయా ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్, నదియా, జగపతిబాబు, నవీన్ చంద్ర, సయీ మంజ్రేకర్‌ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే ఓ టైటిల్ సాంగ్‌ను కూడా వదిలారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘గని' మూవీ నుంచి టీజర్ రిలీజ్

'గని' మూవీని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియోను విడుదల చేశారు. ఇందులో హీరో పాత్రను పరిచయం చేస్తూ చూపించారు. మరీ ముఖ్యంగా అతడు చిన్న వయసులో ఎదుర్కొన్న సమస్యలు.. ఆ తర్వాత బాక్సర్‌గా మారిన విధానం గురించి ఈ వీడియోలో చూపించి అంచనాలు పెంచేశారు.

సర్‌ప్రైజ్ చేసేసిన మెగా పవర్ స్టార్

సర్‌ప్రైజ్ చేసేసిన మెగా పవర్ స్టార్

ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'గని' మూవీ టీజర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఎంతో గంభీరమైన గొంతుతో హీరో పాత్రను పరిచయం చేశాడు. మరీ ముఖ్యంగా ఈ టీజర్‌ వీడియోలో అతడి నోటి నుంచి 'ఆట ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు' అంటూ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించేలా ఉంది.

Recommended Video

Kondapolam Movie Team Interview
పుష్పరాజ్‌తో పోటీ పడబోతున్నాడు

పుష్పరాజ్‌తో పోటీ పడబోతున్నాడు

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గని' మూవీని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని టీజర్‌లో వెల్లడించారు. ఇక, ఇది రావడానికి కొద్ది రోజుల ముందే అంటే డిసెంబర్ 17న అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' మూవీ విడుదల కాబోతుంది. దీంతో మెగా అభిమానులకు వరుస పండుగలు రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X