ముంబై బయల్దేరిన మెగా వారసుడు.. ఎందుకో తెలుసా..?

ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీ కాబోతున్నాడు. ఆయన కెరీర్‌లో పదో సినిమాగా రానున్న సినిమా కోసం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఈ మేరకు ఆయన ముంబై బయల్దేరినట్లుగా తెలుస్తోంది.

వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కెరీర్‌లో తొలిసారిగా వరుణ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు.

 Varun Tej Going to Mumbai For His Next Movie

ఇందుకోసమై ఆయన 2 నెలల పాటు బాక్సింగ్‌లో శిక్షణ పొందడానికి ముంబై వెళుతున్నాడు. బాక్సింగ్ లో శిక్షణను పూర్తిచేసుకుని తిరిగి డిసెంబర్ నెలలో హైద్రాబాద్ చేరుకుంటారట. ఆ తర్వాత వెంటనే జనవరి నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. అల్లు బాబీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి థమన్ బాణీలు కట్టనున్నారు.

ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. టైటిల్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. చిత్రం లోని ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. వరుస సినిమాలతో జోష్‌లో ఉన్న వరుణ్ తేజ్ ఈ మధ్య డిఫరెంట్ లుక్ లోకి మారడమే గాక, వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కారణంగా ఆయన సినిమాలపై క్రేజ్ పెరుగుతూ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X