వరుణ్ తేజ్ సిస్టర్ సెంటిమెుంట్, నిహారికతో క్లాప్.. (ఫోటోస్)
'ఎఫ్2' సంచలన విజయం అందుకున్న మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. జనవరి 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది. వరుణ్ తేజ్ కెరీర్లో 9వ చిత్రం ఇది.
వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్ నివ్వగా, రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేయగా.. సుకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

సిస్టర్ సెంటిమెంట్
‘వాల్మీకి' చిత్రం విషయంలో వరుణ్ తేజ్ సిస్టర్ సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఆయన సోదరి నిహారిక క్లాప్ కొట్టి ప్రారంభించారు. గతంలో వరుణ్ తేజ్ సినిమాల ప్రారంభోత్సవంలో నిహారిక పాల్గొన్న చిత్రాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అందుకే ఈ సెంటిమెంటును ఫాలో అయినట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ చిత్రాలు ఎంచుకుంటూ...
రోటీన్ చిత్రాలు చేయకుండా విభిన్నమైన కథలు, కాన్సెప్టులు ఎంచుకుంటూ పలు ప్రయోగాలు సైతం చేస్తున్నారు వరుణ్ తేజ్. ఆయన గత చిత్రాలు ‘ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్2' ఇవన్నీ కూడా పూర్తి భిన్నమైన చిత్రాలు. తాజాగా ‘వాల్మీకి' సినిమా గ్యాంగస్టర్, కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది.

తమిళ చిత్రానికి రీమేక్
తమిళంలో హిట్టయిన ‘జిగర్తాండ'కు ఇది రీమేక్ అని తెలుస్తోంది. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా... సిద్దార్థ్ హీరోగా నటించాడు. తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్లు సమాచారం.

వాల్మీకి
ఈ చిత్రానికి సంగీతం: రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్, కథ: కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











