యువ హీరోలు జోష్ పెంచారు.. వరుణ్ తేజ్, నితిన్ మొదలుపెట్టేశారు..
బ్లాక్ బస్టర్ విజయాల జోష్‌తో యువ హీరోలు వరుణ్ తేజ్, నితిన్ తమ తదుపరి సినిమాలు మొదలుపెట్టారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకొన్న వరుణ్ తేజ్ తన కెరీర్‌లో పదో సినిమాను విశాఖలో ఘనంగా ఆరంభించారు. ఇక తాజాగా భీష్మతో హిట్ కొట్టిన నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. అంధాదూన్ సినిమా రిమేక్‌లో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. తన కెరీర్‌లో పదో సినిమాను వైజాగ్‌లో ప్రారంభించాడు. బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం భారీగా కసరత్తులు చేసి ఫిజిక్ పెంచేశారు. ఈ సినిమా కోసం కిరణ్ కొర్రపాటి తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం, జార్జ్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభం సందర్బంగా వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. వైజాగ్‌లో నా సినిమా షూటింగ్ ఆరంభమైందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం జూలై 30న రిలీజ్ కానున్నది.

ఇక నితిన్ విషయాని వస్తే.. భీష్మతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నారు. హిందీలో ఘన విజయం అందుకొన్న అంధాదూన్ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక మురళి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ తన ఆరో చిత్రాన్ని ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిస్తున్నది. హరి కే వేదనాథ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీ మధు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది.


Click it and Unblock the Notifications











