వరుణ్ తేజ్ చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమ కథ ఫస్ట్ లుక్!
అనగనగా ఓ ప్రేమ కథ చిత్ర ఫస్ట్ లుక్ శుక్రవారం రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల కానుంది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ మేనల్లుడు అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కానుండడంతో ఈ చిత్రం యువతలోకి బాగా వెళుతుందని భావిస్తున్నారు. ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. రెండు చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఈ ఫస్ట్ లుక్ విడుదల చేయనుండడం విశేషం.

ఈ చిత్ర విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రమోషన్స్ వేగం పెంచనున్నారు.


Click it and Unblock the Notifications











