Varun Tej Wedding లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ డిస్టినేషన్ వెడ్డింగ్.. ఎప్పుడు? ఎక్కడ?
మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైపోయింది. మరో నాలుగు రోజుల్లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ ఒకటో తేదీన వీరి డ్రీమ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరగబోతుంది. అయితే వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు ముందుగానే కొంత మంది కుటుంబ సభ్యులు ఇటలీకి వెళ్లారు. తాజాగా కలిసి ఏడడుగులు వేయబోతున్న నూనత జంట.. ఇటలీకి వెళ్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇద్దరూ కలిసి ఇటలీకి వెళ్తుండగా.. హైదారాబద్ విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు ఇటలీకి ప్రయాణం అయ్యారు. వీరిద్దరు మాత్రమే కాకుండా మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా వీరి వెంట ఉన్నారు. ముఖ్యంగా మెగా డాటర్ నిహారికా కొణిదెల.. తన అన్నా, వదినలతో కలిసి ఇటలీకి వెళ్తుంది. ఎయిర్ పోర్టులో కనిపించిన ఈ జంట స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చారు. బ్లూ జీన్స్, వైట్ టీషర్టు, వైట్ షూ వేసుకున్న వరుణ్ బ్లాక్ కలర్ జాకెట్ ను స్టైల్ చేశాడు. అలాగే లావణ్య టైట్ ఫిట్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. అలాగే పైన ఓ శాలువా కప్పుకొని కనిపించింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కుటుంబ కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి స్నేహితులు, కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహుతులు కూడా హాజరుకాబోతున్నట్లు సమాచారం. నిన్నటికి నిన్ననే వీరి పెళ్లికి సంబంధించిన పత్రిక నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ పత్రికలో వరుణ్ తేజ్ నాయనమ్మ, తాతయ్య పేర్లతో పాటు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు పేర్లు, అలాగే బాబాయి పవన్ కల్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేర్లు కూడా ఉన్నాయి.

మెగా పవర్ స్టార్ రాణ్ చరణ్, ఉపాసన దంపతులే దగ్గరుండి వీరి పెళ్లి పనులు చూసుకుంటున్నారట. అంతే కాదండోయ్ ఇటలీలోని టుస్కానీ నగరంలో సాగే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. అలాగే పెళ్ల తర్వాత వరుణ్ తేజ్, లావణ్య దంపతులతో పాటు మెగా, అల్లు, త్రిపాఠి ఫ్యామిలీలు హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక్కడకు వచ్చాక నవంబర్ ఐదో తేదిన గ్రాండ్ గా రిసిప్షన్ చేసుకుంటారు. వివాహానికి అతి తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించడంతోనే.. భారీ స్థాయిలో రిసిప్షన్ పెట్టనున్నారట. ఈ రిసిప్షన్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది.

జూన్ 9వ తేదీన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జరిగింది. మిస్టర్ సినిమా కోసం తొలసారి ఒకరినొకరు కలుసుకున్న వీరిద్దరికి ఆ సినిమా ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చేసిన అంతరిక్ష సినిమాతో వీరిద్దరి మధ్య స్నేహబంధం కాస్త ప్రేమబంధంగా మారిపోయింది. అయితే వరుణ్ తేజ్ యే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశాడట. ఆమె ఓకే చెప్పడంతో... ఇరుకుటుంబాలకు తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారు.



Click it and Unblock the Notifications











