బ్రేకింగ్: రోడ్డు ప్రమాదానికి గురైన వరుణ్ తేజ్.. ఎక్కడ జరిగిందంటే!
మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ తేజ్ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు ఆందోళన చెందవద్దని సన్నిహితులు వెల్లడించారు. ఇంతకు ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..

కొత్తకోటకు సమీపంలో ప్రమాదం
వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైందని సన్నిహితులు తెలిపారు. కారు పూర్తిగా డామేజ్ అయింది. వరుణ్ తేజ్‌కు ఏపీ కాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దు అని సన్నిహితులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు అని తెలిపారు.

NH44పై సంఘటన
రోడ్డుపై ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారి రాణిపేట సమీపంలో వరుణ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఇండికా కారును ఢీకొన్నది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో హీరో వరుణ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా NH44పై ఈ ప్రమాదం జరిగింది. వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు అని మీడియా వర్గాలు వెల్లడించాయి

ఆందోళనలో మెగా ఫ్యాన్స్
వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త మెగా క్యాంపులో ఆందోళన లేవనెత్తింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు ప్రమాదంపై క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. మీడియా వర్గాలు కూడా ఈ వార్తను ధృవీకరించాయి. వాల్మీకి షూటింగ్ కోసం కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వరుణ్ తేజ్ ట్వీట్
రోడ్డు ప్రమాదంపై వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో స్పందించారు. నేను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దేవుడు దయవల్ల అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నాకు గాయాలు కాలేదు. ఈ సమయంలో నా కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు.

హరీష్ శంకర్ దర్శకత్వం
ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మికీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రాలు F2, ఫిదా చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వాల్మికీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











