మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా రోజుల తరువాత సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యాడు. చెల్లి నీహారిక పెళ్లి తరువాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న వరుణ్ ఇక మొత్తానికి F3 సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు. అలాగే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా పనులను కూడా మొదలు పెట్టాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
కొత్త దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇక దాదాపు టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. అయితే మరోసారి వరుణ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే తొలిప్రేమ టైటిల్ తో హిట్టు కొట్టిన వరుణ్ ఇప్పుడు అదే తరహాలో మరో సినిమాలోని పవన్ క్యారెక్టర్ పేరును టైటిల్ గా సెట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బాలు. అయితే ఆ సినిమాలో పవన్ 'గని' అని ఒక క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పేరును కొత్త సినిమా టైటిల్ గా సెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక ముఖ్యమైమ పాత్రలో నటించనున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











