ఎన్టీఆర్ బయోపిక్.. చిరంజీవి పాత్రలో వరుణ్ తేజ్!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి రోజుకొక ఆసక్తికరమైన వార్త వస్తోంది. ఈ చిత్రంలోని పాత్రలకు దర్శకుడు క్రిష్ స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కోసం దర్శకుడు క్రిష్ వరుణ్ తేజ్ ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ ని చిరంజీవి గెటప్ లో చూపించగలననే ధీమాలో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. 80, 90 దశకాలలో చిరంజీవి మెగాస్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చిరు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవిని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రోత్సహించారు. ఇక చిరు పాత్ర కోసం వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











