twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గని’ విషయంలో వరుణ్ తేజ్ కీలక నిర్ణయం: కరోనా టైమ్‌లోనూ ముందడుగు

    |

    కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అందుకే తక్కువ సినిమాలే చేసినా.. ఎక్కువ విజయాలను అందుకున్నాడు. దీంతో స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. ప్రస్తుతం 'గని' అనే సినిమాను చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇది ఇంకా షూటింగ్‌కు సిద్ధం అవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    కరోనా వైరస్ రోజు రోజుకూ ఎక్కువ అవుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న షూటింగ్‌లు అన్నీ రద్దు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ మాత్రం 'గని' సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంతో సాగే మూవీ కావడంతో ఇండోర్ షూటింగ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో చాలా తక్కువ మంది సిబ్బందితో ఆ సీన్లను చిత్రీకరించాలని భావిస్తున్నాడట దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దీనికి మెగా ప్రిన్స్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

    Varun Tej Ready for Ghani Shooting

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'గని' సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. వీళ్లతో పాటు హిందీ హీరో సునీల్ శెట్టి, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు జగపతి బాబు కూడా మంచి రోల్ చేస్తున్నారట.

    English summary
    Varun Tej is an Indian film actor known for his works in Telugu language films. He made his debut as a lead in the film Mukunda, directed by Srikanth Addala opposite Pooja Hegde. His second film Kanche, also being the first Indian film on WWII, became a super hit and Varun Tej's portrayal of Dhupati Haribabu was critically acclaimed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X