నేనే నా అంటోన్న రెజీనా.. అదిరిపోయిన పోస్టర్
అందంతో పాటు కావాల్సినంత ప్రతిభ ఉన్న నటి రెజీనా. మొదటి నుంచి పాత్రకు ప్రాధాన్యమున్నచిత్రాలనే చేస్తూ వస్తోన్న ఈ అమ్మడు ఈ మధ్య.. అందాలను ఆరబోస్తోంది. అయితే ఈ అమ్మడిని మాత్రం అందరూ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గానే చూస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఎవరు చిత్రంలో హాట్ హాట్‌గా కనబడి అందర్నీ ఆకట్టుకుంది.
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ 'నేనే నా..?'. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. నిను వీడని నీడను నేనే వంటి థ్రిల్లర్ హారర్ సినిమాతో సూపర్‌హిట్ సాధించి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు కార్తీక్ రాజు.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను వరుణ్ తేజ్ రిలీజ్ చేశాడు.

అనంతరం నిర్మాత రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ.. 'మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'నేనే నా..?' సినిమాను కార్తీక్ రాజుగారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు వరుణ్‌తేజ్ రెజీనా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు మా యూనిట్ తరపున స్పెషల్ థాంక్స్. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. నటిగా ఆమెను మరో యాంగిల్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నార'ని అన్నాడు.


Click it and Unblock the Notifications











