వరుణ్ తేజ్ పెద్ద రిస్క్ చేశాడా?... ఉత్కంఠ రేపుతున్న ‘అంతరిక్షం’ టీజర్
Recommended Video

విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ త్వరలో 'అంతరిక్షం' అనే స్పేస్ కాన్సెప్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఝాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
'నేను మళ్లీ చెబుతున్నాను... భారత దేశం దీన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు' అనే డైలాగ్ చెబుతూ ఈ టీజర్లో కనిపించిన వరుణ్ తేజ్.... దేశం కోసం ఏదో పెద్ద రిస్క్ చేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. టీజర్ చూస్తుంటే సినిమా క్షణ క్షణం ఉత్కంగా సాగుతుందని తెలుస్తోంది.
హాలీవుడ్‌కు ఏ మాత్రం తగ్గలేదు
టీజర్ చూస్తుంటే సినిమా హాలీవుడ్ రేంజికి ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. అచ్చం స్పేస్‌లో షూటింగ్ జరిపినట్లే ఉందని, గ్రాఫిక్స్ అని ఏమాత్రం తెలియడం లేదనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులో రాని విభిన్నమైన కాన్సెప్ట్
ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలను నిర్మించిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

హాలీవుడ్ టెక్నీషియన్స్
ది ఎక్స్‌పెండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హెర్క్యులెస్, ది ఇన్‌విజబుల్, లవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కోపోలో, గేమ్ అఫ్ థ్రోన్స్ వంటి హాలివుడ్ ప్రాజెక్టులకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ చిత్రానికి పని చేశారంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

డిసెంబర్ 21 వస్తంది
ఇందులో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాముగా కనిపించబోతున్నారు. కేవలం సైన్స్, ఫిక్షన్ మాత్రమే ఉంటుందా? తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే ఆసక్తికర కథ ఏమైనా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











