‘గని’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: తుదిపోరులో విజయానికి చేరువలో వరుణ్ తేజ్

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. అందరు హీరోల్లా కాకుండా సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. తద్వారా బోలెడన్ని సక్సెస్‌లను దక్కించుకుంటున్నాడు. దీంతో అతడి గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. అలాగే, నటుడిగానూ ఎంతో పరిణితిని పొందుతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు.

ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్‌లను అందుకుంటోన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే సినిమాను చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందులో చివరి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఈ నేపథ్యంలో దీని నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.

 Varun Tejs Ghani Dubbing Works Started

'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. ఇందులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు బాబీ పూజా కార్యక్రమాలు చేయడం కనిపించింది. డబ్బింగ్ పనులు కూడా మొదలవడంతో మెగా ఫ్యాన్స్ దీనిపై ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని తెలుస్తోంది. ఇందులో సెంటిమెంట్ సీన్స్ పుష్కలంగా ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం అప్పట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'తమ్ముడు'ను గుర్తు చేసే విధంగా తెరకెక్కుతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఎప్పటి నుంచో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X